Thursday, April 2, 2020

భారత ప్రభుత్వ చట్టాలు


*🔥1773 రెగ్యులేటింగ్ చట్టం🔥


*🍂1773 లో ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలను నియంత్రించడం కోసం ఈ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంటు చూసింది.ఈ చట్టాన్ని నాటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ నాతో 1773 మే 18న పార్లమెంట్లో ప్రవేశ పెట్టాడు భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి రాజ్యాంగ చట్టంగా కూడా పేర్కొంటారు .బెంగాల్ గవర్నర్ హోదాను పెంచుతూ గవర్నర్ జనరల్ గా మార్చడం జరిగింది మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్.కలకత్తా నగరంలోని పోర్టు విలీనం లో 1784లో సుప్రీంకోర్టు ఏర్పాటు*.




*🔥1784 పిట్స్ ఇండియా చట్టం🔥*


*💐రెగ్యులేటింగ్ చట్టం లోని లోపాలను సవరించడానికి 1784లో బ్రిటిష్ పార్లమెంటు ఈ చట్టాన్ని ఏర్పాటు చేసింది ఆనాటి బ్రిటన్ ప్రధానమంత్రి విలియం పిట్ ఈ చట్టాన్ని రూపొందించడం వలన పిట్ ఇండియా చట్టం గా పిలుస్తారు.ఈస్ట్ ఇండియా కంపెనీ లో మొట్టమొదటి సారిగా ద్వంద్వ పాలన ను ప్రవేశపెట్టారు.వ్యాపార వ్యవహారాలను చూడడానికి కోర్టు ఆఫ్ డైరెక్టర్స్ మరియు రాజకీయ వ్యవహారాలను చూడటానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ను నియమించింది.గవర్నర్ జనరల్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను నాలుగు నుంచి మూడుకు తొలగించడం జరిగింది మొట్టమొదటిసారిగా ఈ చట్టం కంపెనీ యొక్క ప్రాంతాలను British possessions in india గా పేర్కొన్నారు*


*🔥1793 చార్టర్ చట్టం🔥*


*🍁కంపెనీ పాలన కాలంలో రూపొందించిన చట్టాలను చార్టర్ చట్టాలు గా పేర్కొంటారు .కంపెనీ ఆర్థిక వ్యవహారాలను ఈ చట్టం క్రమబద్ధం చేస్తుంది కంపెనీకి భారతదేశంలో వ్యాపారం చేసుకునే అవకాశాన్ని పొడగించారు .గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారాలను విస్తృతం చేయడం జరిగింది మున్సిపాలిటీలకు చట్టబద్ధ కల్పించింది .పోర్టు విలియం కౌన్సిల్లో సర్వ సేనాధిపతి సభ్యత్వం తొలగించడం జరిగింది .భారతీయుల హక్కులు ఆస్తులు వారసత్వం వివాహం మత విషయాలకు సంబంధించి గవర్నర్-జనరల్ చేసే నిబంధనలకు చట్టాలతో పాటుగా సమానమైన విలువ ఉంటుంది*




*🔥1813 చార్టర్ చట్టం🔥*


*🍁ఇండియా కంపెనీకి వాణిజ్యంలో గల ప్రత్యేక ప్రయోజనాలను తొలగించి భారతదేశంలో కంపెనీ పాలనను మరో 20 సంవత్సరాల పాటు కొనసాగింది కంపెనీ యొక్క ఆదాయంపై వ్యాపారం లాభం పై ప్రభుత్వానికి నియంత్రణ కల్పించబడింది స్థానిక సంస్థలకు పనులను నవ్వించడానికి అది చెల్లించని వారిపై చర్యలు తీసుకునే అధికారం ఇచ్చారు .ఈస్ట్ ఇండియా కంపెనీలో భారతీయులకు కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించారు .భారతీయులకు మతపరమైన విద్యాపరమైన అధ్యయనం కోసం ప్రతి ఏటా లక్ష రూపాయలు కేటాయించడం జరిగింది అదేవిధంగా సివిల్స్ శిక్షణ సదుపాయాన్ని కల్పించారు.బోర్డ్ ఆఫ్ కంట్రోల్ యొక్క పర్యవేక్షణ అధికారం మరియు మార్గదర్శకాలు అధికారులు స్పష్టంగా నిర్ణయించబడి దాని పరిధి విస్తృతం చేయబడింది.




*🔥1833 చార్టర్ చట్టం🔥*


*🥀బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను భారత దేశ గవర్నర్ జనరల్ గా మార్చారు మొట్టమొదటి భారత దేశ గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ .ఈ చట్టం ద్వారా బ్రిటిష్ భూభాగాల పై ఆర్థిక సంబంధమైన అధికారం నియంత్రణ లభించింది.భారతీయుల కమీషన్ను నియమించింది భారతదేశంలో సివిల్ క్రిమినల్ వ్యయాన్ని నాయకులను అధికారులను పోలీసు వ్యవస్థను రూపొందించడం కౌన్సిలింగ్ అధికారం ఇచ్చింది .భారతీయ శాసనాలలో క్రోడీకరించడం ఒక భారతీయ లా కమిషన్ ను నియమించారు.దీనికి మొట్ట మొదటి అధ్యక్షుడు లార్డ్ ముకాలే. ఈ చట్టాన్ని భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ పాలన కు తుది మెట్టు గా అభివర్ణిస్తారు.




*🔥1853 చార్టర్ చట్టం🔥*


*🥀చార్టర్ చట్టం లో చిట్టచివరి చట్టం .బ్రిటన్ పార్లమెంటు అనుమతి ఉన్నంత వరకు మాత్రమే వ్యాపారాన్ని నిర్వహించుకునే అవకాశం కల్పించారు సివిల్ సర్వీస్ నియామకాలను బహిరంగ విధానం ద్వారానే ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు .దీనికోసం లార్డ్ మెకాలే కమిటీని 1954లో ఏర్పాటు చేశారు .వివిధ లా కమీషన్ సిఫారసుల ద్వారా సివిల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్ మరియు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ రూపొందించడం జరిగింది ..గవర్నర్ జనరల్ యొక్క సాధారణ మండలి అధికారాలను శాసన కార్యనిర్వాహక రోజులుగా విభజించి శాసనాలు రూపొందించే ప్రక్రియ కొరకు తొలిసారిగా ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు .ఇది బ్రిటిష్ పార్లమెంటు వలె తన విధులను నిర్వహిస్తోంది అందుకే దీనిని పార్లమెంటు అనే వారు .


*🔥1858 విక్టోరియా రాణి ప్రకటన🔥*

*🍂సిపాయిల తిరుగుబాటుతో భారతదేశంలో కంపెనీ పరిపాలన అంతమై చక్రవర్తి ప్రత్యక్ష పరిపాలన ప్రారంభమైంది.1858 నవంబరు 1 న బ్రిటీష్ రాణి భారత పరిపాలనా అధికారాన్ని చేపడుతూ ప్రకటన జారీ చేసింది దీనినే విక్టోరియా మహారాణి ప్రకటన అంటారు.గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియా గా మార్చారు మొదటి వైస్రాయి లార్డ్ కానింగ్.1784లో ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలన రద్దయింది.భారతదేశంలో అత్యున్నత స్థానాన్ని కలిగిన వైస్రాయ్ అని రాజప్రతినిధిగా ఐదు సంవత్సరాల కాలానికి నియమించడం జరిగింది.భారత రాజ్య కార్యదర్శి అనే కొత్త పదవిని సృష్టించారు మొదటి కార్యదర్శి చార్లిస్ ఫుడ్.బ్రిటిష్ రాణి భారత సామాగ్ని బిరుదు ధరించింది*.


*🔥1861 భారత కౌన్సిల్ చట్టం🔥*


*🍂రాజ్యాంగం చట్ట నిర్మాణంలో భారతీయులకు తొలిసారిగా అవకాశం కల్పించారు .పోర్టు పోలియో విధానమును తొలిసారిగా ప్రవేశపెట్టారు .గవర్నర్ జనరల్ కు ఆర్డినెన్స్ను జారీ చేసే అధికారం కల్పించారు బడ్జెట్ను ప్రవేశ పెట్టే పద్ధతిని ప్రారంభించారు.మొదటిసారి భారతదేశంలో కలకత్తాలోని కోర్టు విలియంలో 1962వ సంవత్సరంలో హైకోర్టును ఏర్పాటు చేశారు . 1773 చట్టం ద్వారా రద్దు చేయబడిన బాంబే మరియు మద్రాసు ప్రెసిడెన్సీలో శాసన అధికారాలను పునరుద్ధరించారు ఈ చట్టాన్ని వికేంద్రీకరణ ప్రక్రియకు నాందిగా చెప్పవచ్చు .



*🔥1892 భారత కౌన్సిల్ చట్టం🔥*


*🍂1861 council చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి ఈ చట్టం చేయడం జరిగింది .మొదటిసారిగా పరోక్ష పద్ధతి ద్వారా శాసన సభ్యులను ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది శాసనమండలిలో బడ్జెట్ను చర్చించుకోవడం ప్రశ్నలు అడగడానికి అవకాశం కల్పించడం జరిగింది.లెజిస్లేటివ్ కౌన్సిల్ అధికార పరిధిని విస్తృత పరచి భారతీయులకు వైస్రాయి గవర్నర్ల కౌన్సిలింగ్లో స్థానం కల్పించారు .శాసనసభలో తమ స్థానం నామమాత్రమే అని గ్రహించిన భారతీయులు ఈ చట్టాన్ని వ్యతిరేకించారు* .


*🔥1909 భారత కౌన్సిల్ చట్టం🔥*


*🍂వింటో మార్లే సంస్కరణలు గా కూడా ప్రసిద్ది పొందింది .మార్లే సెక్రటరీ ఆఫ్ స్టేట్గా లార్డ్ మింటో గవర్నర్ జనరల్ గా నేను ఈ కాలంలో పనిచేస్తుండడంతో దీనికి వింటో మార్లే సంస్కరణలు అని పేరు వచ్చింది.మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని భారత దేశంలో ప్రవేశపెట్టారు గవర్నర్ జనరల్ కౌన్సిలింగ్ లోని శాసన మండలి సభ్యుల సంఖ్య 16 నుండి 60 కి పెంచారు .సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిలింగ్ పేరును ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గా మార్చడం జరిగింది .మొదటిసారిగా మత ప్రాతిపదికన ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది ఈ చట్టం మతతత్వానికి చట్టబద్ధత కల్పించినట్లు అయ్యింది అందుకే లార్డ్ నియోజక పితామహుడుగా విమర్శిస్తారు.

*🔥1919 భారత ప్రభుత్వ చట్టం🔥*
*🍂ఈ చట్టానికి మాంటేగ్ -ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలు అనే పేరు కూడా కలదు.మొట్టమొదటిసారిగా కేంద్రంలో ద్విసభా విధానం అమలులోకి వచ్చింది .దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలిచేవారు.ప్రవెల్స్ లలో ద్వంద్వపాలనను ప్రవేశపెట్టడం జరిగింది .మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వ విషయాలు రాష్ట్ర ప్రభుత్వాల విషయాలు అని అధికార విభజన జరిగింది.కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను 1921 సంవత్సరంలో ఏర్పాటు చేశారు కానీ 1926లో దానిని అమలు పరిచారు.


*🔥1935 భారత ప్రభుత్వ చట్టం🔥*
*🍂1919 భారత ప్రభుత్వ చట్టం లోని లోపాలను సరిదిద్దడానికి చట్టం చేయడం జరిగింది.బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ చట్టాలు అన్నిటిలో 1935 చట్టం అతి ముఖ్యమైనది ఈ చట్టంలో 321 నిబంధనలు,10 షెడ్యూల్లు‌, 14 భాగాలు ఉన్నాయి .బ్రిటిష్ పాలిత ప్రాంతాలతో సంస్థలతో అఖిల భారత సమాఖ్య అనే ఒక నూతన చట్టం ఆవిష్కరించింది .రాష్ట్రంలో ఉన్న ద్వంద్వ పాలన ను రద్దు చేసి కేంద్రంలో ఆందోళనకు ప్రవేశపెట్టారు.ఫెడరల్ న్యాయస్థానాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేశారు .కేంద్రంలో ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రాష్ట్రంలో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు .భారత దేశంలో విత్త విధానం మరియు రుణ నియంత్రణ కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియాను ఏర్పాటు చేశారు*.






*🔥భారత స్వతంత్ర చట్టం 1947🔥*


*💐భారత దేశ వ్యవహారాల నిర్వహణ నియంత్రణ కోసం రూపొందించిన చిట్టచివరి చట్టం .మౌంట్ బాటన్ ప్రణాళిక అని కూడా పిలుస్తారు .మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకారం భారత స్వతంత్ర బిల్లును 1947 జూలై 4న బ్రిటిష్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టగా 15వ తేదీన ఆమోదం పొందింది.1947 జూలై 18న బ్రిటిష్ రాణి ఆమోదం పొందింది 1947 ఆగస్టు 15 నుంచి అమలులోకి వచ్చింది .ఈ చట్టం అనుసరించి ఇండియా పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడ్డాయి వీటి కోసం వేర్వేరు రాజ్యాంగ పరిషత్తులు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. దీంతో బ్రిటిష్ పార్లమెంటు యొక్క శాసనాధికారం అంతమైంది సొంత రాజ్యాంగాన్ని రూపొందించే వరకు భారత ప్రభుత్వ చట్టం 1935 ను అనుసరించి పరిపాలన జరిగింది .ఈ చట్టాన్ని యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందం గా పేర్కొంటారు*.

No comments:

Post a Comment