Thursday, April 2, 2020

🔥ఉపరాష్ట్రపతి🔥


*🔥ఉపరాష్ట్రపతి🔥*


*🍂భారత రాజ్యాంగంలో ఐదో భాగంలో నిబంధనలు 63 నుంచి 69 వరకు ఉపరాష్ట్రపతి గురించి తెలియ జేస్తాయి ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినవారు హెచ్వి కామత్ .ఉపరాష్ట్రపతి పదవిని ఆ దేశం అమెరికా నుంచి గ్రహించింది నిబంధన 63 ప్రకారం భారత దేశానికి ఉపరాష్ట్రపతి ఉండాలి.నిబంధన 64 ప్రకారం ఉప రాష్ట్రపతి పదవి రీత్యా రాజ్యసభ చైర్మన్ గా ఉంటారు నిబంధన ప్రకారం రాష్ట్రపతి పదవి ఏ కారణంతో ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతి గా వ్యవహరిస్తారు.నిబంధన 66 ఉప రాష్ట్రపతి ఎన్నిక గురించి పేర్కొంటుంది.నిబంధన 67 ఉపరాష్ట్రపతి పదవీకాలం తెలియజేస్తుంది .నిబంధన 68 నూతన రాష్ట్రపతి ఎన్నిక .నిబంధన 69 ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం* .


*🔥ఉప రాష్ట్రపతి ఎన్నికకు అర్హులు🔥*


*🍂భారత పౌరుడై ఉండాలి. 30 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.రాజ్యసభ సభ్యుడు కావడానికి కావలసిన అర్హతలు కలిగి ఉండాలి లాభదాయకమైన అధికార పదవులలో కాని కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వ ఉద్యోగంలో కానీ ఉండరాదు.లోక్సభ రాజ్యసభ లేదా రాష్ట్ర శాసనసభ శాసనమండలి వీటిలో ఏ ఒక్క దానిలో సభ్యుడై ఉండరాదు .ఒకవేళ సభ్యుడై ఉన్న పక్షంలో ఉపరాష్ట్రపతిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ సభ్యత్వాన్ని కోల్పోతాడు*.

*🔥ఉప రాష్ట్రపతి అధికారాలు బాధ్యతలు🔥*
*🍂హోదా రీత్యా ఉపరాష్ట్రపతి రాజ్యసభ అధ్యక్షునిగా కొనసాగుతూ రాజ్య సభ కార్యకలాపాలను నిర్వహిస్తాడు తాత్కాలిక రాష్ట్రపతి హోదాలో ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి రాజ్యసభ కు చెందిన బాధ్యతలు నిర్వర్తించరాదు.ఆ కాలంలో రాష్ట్రపతి పదవికి అన్ని అధికారాలు జీతభత్యాలు సౌకర్యాలు మొదలైనవన్నీ కూడా తాత్కాలిక రాష్ట్రపతికి లభిస్తాయి గౌరవ బిరుదుల ప్రధాన కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు .కొన్ని కేంద్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్స్లర్గా పనిచేస్తారు రాష్ట్రపతి లేక ప్రధానమంత్రి కోరికపై రాజ్యాంగ, చట్ట సంబంధమైన ,దౌత్య సంబంధమైన విషయాలలో సలహాలు ఇస్తూ ఉంటాడు*

No comments:

Post a Comment